V1News Telangana

best news portal development company in india

ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించిన శ్రీ వెంకట సాయి విద్యానికేతన్ హై స్కూల్…..

SHARE:

V1 న్యూస్ నసురుల్లాబాద్ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల కేంద్రంలో గల శ్రీ వెంకట సాయి విద్యానికేతన్ హై స్కూల్లో గురువారం రోజు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకొని పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా విగ్నేశ్వరుడి స్మరణ మరియు సరస్వతి స్తోత్రాన్ని పటించారు. అనంతరం గురువులను స్మరించుకుని ఈ సందర్భంగా విద్యార్థినీ, విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి విద్యార్థులకు పాఠాలను బోధించారు. ఈ సందర్భంగా పలువురు 9వ తరగతి మరియు పదవ తరగతి విద్యార్థులు సాయి ప్రణవి, సంయుక్త గౌడ్, మనోజ్ఞ రెడ్డి, నుస్రా, మౌనిక, శివాజీ మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తిలో గల ఆనందాన్ని మరియు కష్టాలను గురించి ఈరోజు అనుభవపూర్వకంగా తెలుసుకున్నామని అన్నారు. విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దడంలో సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర మరియు గొప్పతనం ఎంతగానో ఉందని వారు కొనియాడారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠాలు బోధించాలంటే ముందుగా వారు ఎంతో శ్రమించాలని తెలిపారు. లోకంలో తల్లిదండ్రుల తర్వాత నిస్వార్ధంగా విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది ఉన్నత శిఖరాలకు ఎదిగే విధంగా శాయశక్తుల వారి సేవలలో కీలక పాత్ర పోషిస్తున్న గురువులందరికీ వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పాఠశాల యాజమాన్యం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి మరియు ఉత్తమ విద్యా బోధన చేసిన విద్యార్థి (ఉపాధ్యాయులకు) ప్రోత్సాహకంగా బహుమతులను అందజేశారు. పాఠశాల కరస్పాండెంట్ శివ మాట్లాడుతూ అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి సంవత్సరం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. ఉపాధ్యాయ వృత్తిలో సంతృప్తి ఉంటుందని విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదిగినప్పుడు ఆ సంతోషం వర్ణించలేనిదని అభిప్రాయం వ్యక్తం చేశారు. సమాజంలో విద్యార్థులు ఉపాధ్యాయుల పట్ల గౌరవ మర్యాదలతో మెదులుకోవాలని తద్వారా ఉపాధ్యాయులు వారిని గొప్ప వారిగా తీర్చిదిద్దడంలో తమ వంతు పాత్ర పూజిస్తారని అన్నారు. సమాజంలో అన్ని రంగాలలో పనిచేసే ఉన్నత అధికారులు అందరూ కూడా విద్యార్థి దశ నుండే క్రమశిక్షణతో పాటు శ్రద్ధగా చదువుకోవడం వలన ఉన్నత శిఖరాలకు చేరుకోగలిగారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుల సిబ్బంది మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india