సాలురా చెక్పోస్టు తీరు మారేది ఎన్నడు
బోధన్
సాలు రా
మహారాష్ట్ర సరిహద్దుకు ఆనుకొని ఉన్న బోధన్ నియోజకవర్గంలోని సాలూర చెక్పోస్టు తీరు మారేది ఎన్నడో అని ప్రజలు భావిస్తున్నారు.సాలురా చెక్ పోస్ట్ లో ఉన్నత అధికారులు ఉండరు అని ప్రైవేటు వ్యక్తులే అంతా నా ఇష్టం అన్న చందంగా వ్యవహరిస్తూ వసూళ్ల పర్వం కొనసాగిస్తున్నారని విమర్శలు లేకపోలేదు, వసూళ్ల పర్వం రోజురోజుకు మితిమీరుతున్నప్పటికీ, గతంలో ఏసీబీ దాడులు అయినప్పటికీ, మళ్లీ వసూళ్ల పర్వం ఆగలేదని మళ్లీ మితిమీరి పోతుందని, వీటిపై ఎవరైనా ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చినా సంబంధిత శాఖ అధికారులు ముందస్తుగానే, వీరికి సమాచారం ఇస్తున్నారని ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఏది నిజమనేది చర్చనీయాంశంగా మారింది, ఓవర్ లోడుతో ఉన్న వాహనాలను ధర్మకాంత చేయాల్సిన పరిస్థితి ఉండగా ధర్మ కంట లేకపోవడంతో వసూళ్లకు భారీగా పాల్పడుతున్నారని విమర్శలు లేకపోలేదు, సీసీ కెమెరాలు లేకపోవడం ఆన్లైన్ సౌకర్యం లేకపోవడం వల్ల వసూళ్ల పర్వం భారీగా చేస్తున్నారని విమర్శలు లేకపోలేదు, సిగ్నల్ లేవనే సాకుతో ఆన్లైన్ సౌకర్యం ఉంచడం లేదని విమర్శలు లేకపోలేదు, ఉన్నతాధికారులు మాత్రం ఎప్పుడూ కనిపించరని ప్రవేటు వ్యక్తులే అక్కడ కనిపిస్తారని వారు భారీగా వసూళ్లపర్వం చేస్తున్నారని విమర్శలు లేకపోలేదు ఇకనైనా ఇక్కడ పరిస్థితులు మారుస్తారా, లేక వసూళ్ల పర్వం ఇంకా జాదా చేస్తారా ఎదురు చూడాలని ప్రజలు భావిస్తున్నారు, అభిప్రాయపడుతున్నట్లు చర్చలు వినిపిస్తున్నాయి.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....









