V1News Telangana

best news portal development company in india

భారతీయ జనతా పార్టీ “సభ్యత్వ నమోదు”కార్యక్రమం భవిష్యత్ కార్యాచరణ సమావేశం నిర్వహణ…..

SHARE:

-“సభ్యత్వ నమోదు” కార్యక్రమాన్ని అందరూ ఒక యజ్ఞంలో నిర్వహించాలి

-క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసుకునే దిశగా అందరూ పని చేయాలి

-మత మార్పిడి ముసుగులో హిందువుల మనోభావాలను దెబ్బతీసేవారిని ధీటుగా ఎదుర్కోవాలి

-బిజెపి మండల అధ్యక్షుడు సున్నం సాయిలు

V1 న్యూస్ నసురుల్లాబాద్ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల కేంద్రంలో శనివారం రోజు భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశానుసారం భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు సున్నం సాయిలు ఆధ్వర్యంలో “సభ్యత్వ నమోదు”బాధ్యతలను గ్రామాల వారీగా నాయకులకు మరియు కార్యకర్తలకు అప్పగించడానికి బిజెపి కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు దొరబాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ “సభ్యత్వ నమోదు” కార్యక్రమాన్ని ప్రతి గ్రామాలలో బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్రం ఇన్చార్జులు, మరియు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా, అత్యంత పటిష్టంగా చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు సున్నం సాయిలు మాట్లాడుతూ” సభ్యత్వ నమోదు” కార్యక్రమాన్ని పార్టీ నాయకులు అందరూ కలిసి ఒక యజ్ఞం లా నిర్వహించాలని దిశా నిర్దేశం చేశారు. తద్వారా క్షేత్రస్థాయిలో పార్టీ మరింత బలోపేతం చెందుతుందని అన్నారు. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలలో అది పార్టీకి ఎంతగానో ఉపయోగపడుతుందని సూచించారు. అదేవిధంగా మత మార్పిడి ముసుగులో మన హిందువుల మనోభావాలను దెబ్బతీస్తే దుష్టశక్తులను దీటుగా ఎదుర్కోవడానికి హిందువులందరినీ చైతన్యవంతులుగా మార్చి “సభ్యత్వ నమోదు”కార్యక్రమాన్ని నిర్వహించాలని తెలిపారు. ఇదే ప్రణాళికలతో భవిష్యత్ కార్యాచరణను కొనసాగిస్తే తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలోపేతం చెంది 2028 శాసనసభ ఎన్నికలలో విజయం సాధించడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని పార్టీ శ్రేణులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి కిసాన్ మోర్చా అధ్యక్షుడు గొడిసెల యాదగిరి గౌడ్, కంది పెద్ద మల్లేష్, శేఖర్, పవన్, మహేష్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india