V1News Telangana

best news portal development company in india

కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో చెత్తను సేకరించి రెండు కొత్త డాక్టర్లను ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు….

SHARE:

V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: కామారెడ్డి పట్టణంలో మున్సిపల్ కార్యాలయం లో శనివారం రోజు నూతన ట్రాక్టర్లు రెండింటిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ మరియు జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ కామారెడ్డి పట్టణంలో పారిశుద్ధ్య సమస్యను నిర్మూలించడానికి ఉపయోగకరంగా ఉండే విధంగా రెండు కొత్త ట్రాక్టర్లను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. పారిశుద్ధ్య లోపం వలన అధికంగా దోమలు వ్యాప్తి చెంది ప్రజలు అనేక రకాల వ్యాధుల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల పారిశుద్ధ్య సిబ్బంది ప్రతిరోజు క్రమం తప్పకుండా చెత్తను సేకరించి డంపింగ్ యార్డ్లకు తరలించాలని పారిశుద్ధ్య సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి పట్టణ మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి, డిసిసి కైలాస్ శ్రీనివాస్, కామారెడ్డి పట్టణం కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india