V1News Telangana

best news portal development company in india

రుద్రూర్ అగ్రికల్చర్, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ మరియు వార్డెన్ ను వెంటనే సస్పెండ్ చేయాలని (AISB) (TSP) విద్యార్థి సంఘం నాయకుల డిమాండ్ …..

SHARE:

V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:

నిజామాబాద్ జిల్లా: రుద్రూర్ మండలంలోని అక్బర్ నగర్ గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ ఫుడ్ అండ్ టెక్నాలజీ కళాశాల హాస్టల్ లో శనివారం రోజు ఓ విద్యార్థిని బాత్రూంలో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఈ సంఘటనపై శనివారం ఉదయం ,విషయాన్ని తెలుసుకున్న విద్యార్థి సంఘాల నాయకులు ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ (AISB) జిల్లా అధ్యక్షులు బైరపూర్ రవీందర్ గౌడ్, ( TSP )తెలంగాణ స్టూడెంట్ పరిషత్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మావురం శ్రీకాంత్ మాట్లాడుతూ విద్యార్థిని మృతదేహాన్ని హుటాహుటిన, ఆగమేఘాల మీద బోధన్ ఏరియా ఆసుపత్రికి తరలించడం రుద్రూర్ సిఐ మృతురాలి తల్లిదండ్రుల అనుమతి లేకుండా వాళ్లు అగ్రికల్చర్ కళాశాలకు వస్తున్నామని సమాచారం అందించినప్పటికీ.. వాళ్ళ మాటలు గాని విద్యార్థి సంఘాల నాయకుల మాటలు గాని బేఖాతరు చేస్తూ..విద్యార్థి సంఘాల నాయకులపైన చేయి చేసుకోవడం, మండిపాటు ఎందుకని ఫ్రెండ్లీ పోలీస్ అంటూనే పోలీసు శాఖకు చెడ్డ పేరు తీసుకు వచ్చే ఆలోచన సిఐ కి తగదని నీ సొంత నిర్ణయం మేరకు దౌర్జన్యంగా మృతదేహాన్ని తరలించడం సరైన నిర్ణయం కాదని ఎంత చెప్పినా వినకుండా విద్యార్థి సంఘాల నేతలపై చేయి చేసుకోవడం పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని వాపోయారు. ఈ విషయంలో బాగా ఆలోచించాల్సిన అవసరం ఏర్పడిందని అన్నారు. ఈ సందర్భంగా వెంటనే కళాశాల ప్రిన్సిపల్ ని మరియు హాస్టల్ వార్డెన్ ని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా మృతురాలి కుటుంబానికి 20 లక్షల రూపాయలు నష్టపరిహారం కానీ లేదా వాళ్ళ కుటుంబంలో ఒక వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వవలసిందిగా అధికారులను కోరారు. లేనియెడల జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని మరియు తెలంగాణ ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీని (AISB) మరియు ( TSP) ఆధ్వర్యంలో ముట్టడిస్తామని హెచ్చరించారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india