V1News Telangana

best news portal development company in india

శ్రీమతి దీపా దాస్ మున్షి ని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపిన పోచారం శ్రీనివాస్ రెడ్డి…..

SHARE:

V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి శనివారం రోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ శ్రీమతి దీపా దాస్ మున్షి ని మర్యాదపూర్వకంగా కలిశారు. వ్యవసాయ శాఖ సలహాదారుడిగా నియామకం కావడానికి సహకరించినందుకు ఆమెకు శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందించి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో జరిగే వ్యవసాయ శాఖ సలహాదారుడిగా బాధ్యతల స్వీకారం కార్యక్రమానికి ప్రత్యేక అతిధిగా హాజరుకావాలని శ్రీమతి దీపా దాస్ మున్షిని పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆహ్వానించారు. ఆహ్వానాన్ని అంగీకరించి ఆమె కార్యక్రమానికి తప్పకుండా హాజరవుతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మాజీ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, హైదరాబాద్ డిసిసి అధ్యక్షులు రోహిన్ రెడ్డి, గాల్ రెడ్డి, రాజీవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india