V1News Telangana

best news portal development company in india

బొమ్మందేవ్ పల్లి గ్రామంలో అత్యధికంగా 133 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు…..

SHARE:

V1 న్యూస్ నసురుల్లాబాద్ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండలంలోని బొమ్మన్దేవ్ పల్లి గ్రామంలో శనివారం రోజు ఎడతెరిపి లేకుండా కురిసిన కుండపోత వర్షం 133 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైనట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమై ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. గ్రామ శివారులో గల సబ్స్టేషన్ ఆవరణలో చాలా నీరు నిలిచిపోయింది. విషయాన్ని తెలుసుకున్న సబ్ కలెక్టర్ కిరణ్మయి బొమ్మందేపల్లి గ్రామాన్ని సందర్శించి విషయాన్ని గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె గ్రామస్తులకు తుఫాను ప్రభావం వలన ఇంకా అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి.. కావున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ తో పాటు ఎమ్మార్వో ప్రవీణ్ కుమార్, ఆర్ఐ హన్మండ్లు, గ్రామ మాజీ సర్పంచ్ అన్నం సత్యనారాయణ, సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india