V1News Telangana

best news portal development company in india

పిడుగుపాటు కారణంగా విద్యుత్ షాక్ తగిలి మరణించిన బాలిక కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందించిన మాజీ ఏఎంసీ చైర్మన్…..

SHARE:

V1 న్యూస్ నసురుల్లాబాద్ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: నస్రుల్లాబాద్ మండలంలోని నాచుపల్లి గ్రామంలో శనివారం రోజు పిడుగుపాటు కారణంగా విద్యుత్ షాక్ తగిలి గైని స్వాతి అనే బాలిక మరణించిన విషయాన్ని తెలుసుకొని మాజీ ఏఎంసీ చైర్మన్ పెరిక శ్రీనివాస్ తన అనుచరులతో కలిసి నాచుపల్లి గ్రామానికి వెళ్లి మృతదేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. సంఘటనకు సంబంధించిన విషయాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. చిన్న వయసులో బాలిక మరణం పట్ల ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు. విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి తగిన న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటానని మృతురాలి కుటుంబ సభ్యులకు తెలిపారు. అనంతరం ఆయన మానవతా దృక్పథంతో అంత్యక్రియల నిమిత్తం మృతురాలి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంలో ఆయనతోపాటు ఆర్ఐ హన్మండ్లు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india