V1News Telangana

best news portal development company in india

పిడుగు పాటుకు వైర్ తెగిపోయి విద్యుత్ షాక్ తగిలి మృతి చెందిన బాలిక…..

SHARE:

V1 న్యూస్ నసురుల్లాబాద్ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండలంలోని నాచుపల్లి గ్రామంలో శనివారం రోజు ఉరుములు మెరుపులతో కురిసిన భారీ వర్షం కారణంగా విద్యుత్ వైరు పై పిడుగు పడడంతో మంటలు చెలరేగి వైరు తెగి రేకుల ఇంటిపై పడడం వలన విద్యుత్తు షాక్ తగిలి గైని స్వాతి అనే బాలిక మరణించిన విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే విద్యుత్ వైరు తెగి ఇంటిపై పడిన విషయం గమనించకపోవడం వలన బాలిక ఇంటికి గల ఇనుప డోర్ ను తెరవడానికి ప్రయత్నించే క్రమంలో ఒక్కసారిగా తీవ్రంగా విద్యుత్ షాక్ తగిలి మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. బాలిక మరణాన్ని జీర్ణించుకోలేక కుటుంబ సభ్యులు మృతదేహం వద్ద బోరున విలపించారు. చలాకీగా ఉండే బాలిక ఉన్నట్టుండి విగత జీవిగా పడి ఉండడం పట్ల గ్రామస్తులు కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. నిరుపేద కుటుంబానికి చెందిన వారిని ప్రభుత్వం ఆదుకొని తగిన న్యాయం చేయాలని గ్రామస్తులు కోరారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india