V1News Telangana

best news portal development company in india

తీవ్ర జ్వరం కారణంగా చికిత్స పొందుతూ మృతి చెందిన మైనారిటీ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థిని…..

SHARE:

V1 న్యూస్ బాన్సువాడ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా:
బాన్సువాడ మైనారిటీ బాలికల గురుకుల పాఠశాల లో విద్యను అభ్యసిస్తున్న అంజలి అనే 7వ తరగతి విద్యార్థిని శుక్రవారం రోజు రాత్రి తీవ్ర జ్వరంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే అంజలి జుక్కల్ మండలం పడంపల్లి గ్రామానికి చెందిన అమ్మాయి అని తెలిపారు ..ఈ విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లి తండ్రులు,గ్రామస్తులు పాఠశాలకు చేరుకుని ఉపాధ్యాయులపై మరియు ప్రిన్సిపాల్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.600లకు పైగా విద్యార్థులు చదువుతున్న గురుకుల పాఠశాలలో ఒక్క నర్సు లేకపోవడం వలన అనారోగ్యం బారిన పడిన విద్యార్థులకు సమయానికి చికిత్స అందకపోవడం వలన విద్యార్థిని చనిపోయిందని తల్లిదండ్రులు బోరున విలపించారు. పాఠశాల సిబ్బంది పట్టించుకోక పోవడం వలన.. ప్రిన్సిపాల్ తీరు పై గ్రామస్తులు మండిపడ్డారు.చనిపోయిన విద్యార్థిని అంజలి గత మూడు రోజులుగా తీవ్ర జ్వరం తో అవస్థ పడుతున్న సిబ్బంది స్పందించలేదని,చివరికి ప్రాణాపాయ స్థితిలో ఉన్న అంజలిని దవాఖానా కు తరలించారని,పరిస్తితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందిందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.విషయం తెలుసుకున్న బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి వెంటనే పాఠశాలకు చేరుకుని విద్యార్థిని మృతి పై ఆరా తీశారు.ఆమె మీడియాతో మాట్లాడుతూ అన్ని కోనాల్లో దర్యాప్తు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు,నిర్లక్ష్యం చేసిన వారి పై కఠిన చర్యలుతీసుకుంటానని ఆమె తెలిపారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india