V1 న్యూస్ నసురుల్లాబాద్ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: బిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావ్ తనయ కవిత జైలు నుండి విడుదలైన సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు, బాన్సువాడ మున్సిపల్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ ఆధ్వర్యంలో నసురుల్లాబాద్ మండల కేంద్రంలో బుధవారం రోజు పార్టీ శ్రేణులతో కలిసి సంబరాలు జరుపుకున్నారు. ఈ క్రమంలో వారు బాణాసంచా పేల్చి అందరికీ మిఠాయిలు పంపిణీ చేశారు. దాదాపు 166 రోజుల జైలు జీవితం గడిపిన తర్వాత విడుదలైన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత కు భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడం పట్ల వారు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా షేక్ జుబేర్ మాట్లాడుతూ బాన్సువాడ నియోజకవర్గ వ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నామని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై కుట్రపూరితంగా అసత్య ఆరోపణలు చేసి ఆమెను జైలు పాలు చేశారని అన్నారు. అవినీతి ఆరోపణలు చేసి ఈడి డిపార్ట్మెంట్ విచారణలు జరిపి ఎన్ని రకాల ఇబ్బందులకు గురిచేసినప్పటికీ చివరికి న్యాయం గెలిచిందని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి ఎప్పటికైనా ఆడపడుచు ఉసురు తగులుతుందని ఆయన అన్నారు. బిఆర్ఎస్ పార్టీ దమ్మున్న పార్టీ అని తెలిపారు. ఉద్యమాలు పార్టీకి కొత్త కాదని సూచించారు. బిఆర్ఎస్ పార్టీ ఏ పార్టీలకు తొత్తుగా పని చేయదని, ఎవరికి తలవంచదని అన్నారు. ఆచరణ సాధ్యం కానీ హామీలతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ తొమ్మిది నెలలు గడిచిపోయినప్పటికీ ఇప్పటివరకు పూర్తిస్థాయిలో రైతు రుణమాఫీ చేయలేదని అన్నారు. 40 శాతం మంది రైతులకు రుణమాఫీ చేశారని, అందులో వారి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు, స్పీకర్ కు రుణమాఫీ చేసి.. ప్రభుత్వం రుణమాఫీ చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. పంట పెట్టుబడి సహాయం కింద రైతు భరోసా డబ్బులు ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో జమ చేయలేదని, రైతులు బ్యాంకుల వద్ద మరియు వ్యవసాయ శాఖ అధికారుల వద్ద పడిగాపులు కాస్తున్నప్పటికీ వారి గోడును పట్టించుకునే నాథుడు లేరని మండిపడ్డారు. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి వ్యవసాయ శాఖ సలహాదారుగా మరియు కాసుల బాలరాజు రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ గా కొనసాగుతున్నప్పటికీ రైతులు పడుతున్న బాధలను పట్టించుకోవడంలేదని అన్నారు. రైతుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి రుణమాఫీ మరియు రైతు భరోసా డబ్బులను విడుదల చేయించి రైతులకు న్యాయం జరిగే విధంగా చూడాలని డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనలో తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని కొనియాడారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాన్సువాడ నియోజకవర్గానికి అభివృద్ధి కొరకు దాదాపు 12 వేల కోట్లు మంజూరు చేశారని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన ఇదే పిలుపుగా భావించి కార్యకర్తలకు, యువతకు పిలుపునిచ్చారు. యువత రాజకీయాల్లో కి వచ్చి ప్రజల శ్రేయస్సు కొరకు పనిచేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మరియు మంత్రులు మతిభ్రమించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. మలిదశ ఉద్యమం త్వరలో ప్రారంభం కాబోతుందని కార్యకర్తలందరూ కలిసికట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ని ఉవ్వెత్తున ఎగసిపడే కెరటంలా దూసుకుపోయేలా పనిచేయాలని ఈ సందర్భంగా ఆయన ప్రజలందరికీ పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా ప్రజలందరూ బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏదో ఒక పథకం ద్వారా లబ్ధి పొందిన వారేనని తెలిపారు. బెదిరింపులకు భయపడకుండా రాష్ట్ర ప్రజలందరూ బిఆర్ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ నాయకత్వంలో పనిచేసి రాష్ట్ర అభివృద్ధిలో పాలుపంచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నసురుల్లాబాద్ గ్రామ నాయకులు గొడిసెల నర్సింలు గౌడ్, టేకుర్ల సాయిలు, మంగళి సాయికుమార్, మోసీన్, అల్లం గంగారం, చుంచు శేఖర్, అఫ్రోజ్, అంజయ్య, అశోక్, గంగారాం, బద్రి, రమేష్ యాదవ్, మోచె గణేష్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








