V1 న్యూస్ నసురుల్లాబాద్ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: బీర్కూర్ మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో కొండపై వెలసిన తెలంగాణ తిరుమల దేవస్థానం ఆవరణలో నిర్మించిన సాక్షి వినాయక దేవాలయం యొక్క 8 వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయ నిర్మాణ దాత ఉప్పలపాటి వెంకట్రావ్ శ్యామల దంపతులు తిమ్మాపూర్ గ్రామ వాస్తవ్యులు వారి చేతుల మీదుగా మంగళవారం రోజు ఉదయం 6 గంటలకు అభిషేకం, ప్రత్యేక అలంకరణ మరియు 9:00 గంటల నుండి గణపతి పూజ, పుణ్యా వచనం, రక్షాబంధన్, మండప ఆరాధన గణపతి హోమం, పూర్ణాహుతి మొదలగు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించబడతాయి. అనంతరం ఆలయ అర్చకులు కులకర్ణి గోవింద్ మరియు అనంత్ లు తీర్థప్రసాద వితరణ మరియు ఆశీర్వచనం అందిస్తారు. కావున ఈ యొక్క దైవిక కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని.. ఆ విఘ్నేశ్వరుడి కృపాకటాక్షాలు పొంది.. కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని ఆలయ కమిటీ సభ్యులు కోరుతున్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








