V1News Telangana

best news portal development company in india

బిఆర్ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన “రైతు ధర్నా” కార్యక్రమానికి తరలి వెళ్లిన మండల నాయకులు…..

SHARE:

V1 న్యూస్ నసురుల్లాబాద్ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావ్ కోరిక మేరకు మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ బాన్సువాడ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ బాధ్యతలు స్వీకరించి బుధవారం రోజు బాన్సువాడ పట్టణ కేంద్రంలో రైతుల రుణమాఫీ గురించి మద్దతు తెలుపుతూ “రైతు ధర్నా” కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి నియోజకవర్గంలోని వివిధ మండలాల నుండి నాయకులు మరియు కార్యకర్తలు తరలి వెళ్లారు. ఇదే క్రమంలో నసురుల్లాబాద్ మండల కేంద్రానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు రైతు ధర్నా కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావ్ మరియు బిఆర్ఎస్ పార్టీ పై వారికి ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మేము కేసీఆర్ వెంటే నడుస్తామని తెలిపారు. ఆయన రెండు దఫాలు ముఖ్యమంత్రిగా కొనసాగి రాష్ట్రాన్ని అభివృద్ధి పతంలోకి తీసుకొచ్చారని అన్నారు. ఎన్నో రకాల సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు అందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు గొడిసెల నర్సింలు గౌడ్,టేకుర్ల సాయిలు, చుంచు శేఖర్, మోసిన్, వైదికుల సాయికుమార్, అల్లం గంగారం, దేశ్ పాక్ సాయిలు, హైమద్, అన్వర్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india