V1News Telangana

best news portal development company in india

సినీ కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి 64 జన్మదిన వేడుకను నిర్వహించిన అభిమాని…..

SHARE:

ఈ-చిన్ననాటి నుండి చిరంజీవి అంటే ప్రత్యేక అభిమానం

-భగవంతుడి ఆశీస్సులతో ఆయన నిండు నూరేళ్లు జీవించాలి

-చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ బాన్సువాడ డివిజన్ అధ్యక్షుడు మైషా గౌడ్

V1 న్యూస్ నసురుల్లాబాద్ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: సినీ కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి 64వ జన్మదినాన్ని పురస్కరించుకొని నసురుల్లాబాద్ మండల కేంద్రంలో గల అంగన్వాడి కేంద్రంలో చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ బాన్సువాడ డివిజన్ అధ్యక్షుడు మైషా గౌడ్ పిల్లలతో కలిసి కేక్ కట్ చేసి జరుపుకున్నారు. ఈ క్రమంలో పిల్లలకు కేక్ మరియు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్ననాటి నుండి చిరంజీవి అంటే ప్రత్యేక అభిమానమని తెలిపారు. చదువుకునే రోజుల్లో ఆయన నటించిన సినిమాలను స్నేహితులతో కలిసి తప్పకుండా చూసేవాళ్ళమని అన్నారు. చిరంజీవిపై ఉన్న అభిమానంతో తాను రాజకీయ పార్టీ స్థాపించినప్పుడు ఆయన వెంటే అడుగులు వేసామని తెలిపారు. కొన్ని అనివార్య కారణాల వల్ల పార్టీని తొలగించినప్పటికీ అతనిపై గల అభిమానాన్ని కొనసాగిస్తూ ప్రతి సంవత్సరం జూన్ 22వ తేదీన ఆయన జన్మదిన వేడుకలను నిర్వహిస్తున్నామని తెలియజేశారు. భగవంతుడి ఆశీస్సులతో ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవిస్తూ ఇంకా చాలా చిత్రాలలో నటించి ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని, అదేవిధంగా అభిమానులు మరియు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి కేంద్రం ఉపాధ్యాయురాలు గౌరమ్మ, లలిత, నవంతిక, మానస, మమత, పిల్లలు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india