V1News Telangana

best news portal development company in india

రాత్రి ప్రయాణికులకు తలనొప్పిగా మారిన కుక్కలు .. బండ్లను వెంబడిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్న వైన్యం .. పట్టించుకునే నాథుడే లేడు 

SHARE:

రాత్రి ప్రయాణికులకు తలనొప్పిగా మారిన కుక్కలు

బండ్లను వెంబడిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్న వైన్యం

పట్టించుకునే నాథుడే లేడు

V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది రామగుండం ఆగస్టు 22:-

రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో రాత్రిపూట కుక్కల దాడి జరుగుతుంది. ఖని పారిశ్రామిక ప్రధాన సెంటర్లలో పదుల సంఖ్యలో కుక్కలు స్వయం విహారం చేస్తున్నాయి. రోజురోజుకు కుక్కల దాడి పెరుగుతుంది. రాత్రి వేళలో ప్రయాణిస్తున్న ప్రయాణికుల బండ్లను వెంబడిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. తిలక్ నగర్ సెంటర్ రమేష్ నగర్ సెంటర్ జోహార్ నగర్ స్టేడియం లక్ష్మీ నగర్ ఊర్వశి థియేటర్ లైన్లో సెంటర్కు 10 చొప్పున కుక్కలు స్వయం విహారం చేస్తూ వచ్చే పోయే వారి బండ్లను వెంబడిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. దీనిపై మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడం వల్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళలో మున్సిపల్ సిబ్బంది అధికారులు స్వయంగా తిరుగుతూ ఏ సెంటర్లో ఎన్ని ఉన్నాయో వాటి నివారణకు ఇలాంటి చర్యలు తీసుకోవాలనేది స్వయంగా వెళ్లి తెలుసుకోవాలని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

*రోజురోజుకు పెరుగుతున్న కుక్కల దాడి*

రాత్రి వేళలో ఆటోలు కార్లు బైకులపై ప్రయాణిస్తున్న ప్రజల బండ్ల వెంబడి పడుతూ రోడ్డు ప్రమాదాలకు దారి తీసే విధంగా భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. దీనిపై రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజలు ఆవేదన చెందుతున్నారు.

Namani Rakesh Netha
Author: Namani Rakesh Netha

STAFF REPORTER RAMAGUNDAM

best news portal development company in india