V1News Telangana

best news portal development company in india

రుణమాఫీ కానీ రైతుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్న వ్యవసాయ శాఖ అధికారి…..

SHARE:

V1 న్యూస్ నసురుల్లాబాద్ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రుణమాఫీ కానీ రైతులు బుధవారం రోజు మండల కేంద్రంలో గల రైతు వేదిక లో వ్యవసాయ శాఖ అధికారి కె. గోపాల్ కు సంబంధిత ధ్రువపత్రాలతో పాటు వినతి పత్రాలు అందజేశారు. కొంతమంది రైతులకు సాంకేతిక లోపాల వల్ల మరియు కొంతమందికి రేషన్ కార్డును ప్రామాణికం గా తీసుకోవడం వలన మరియు మరి కొంతమందికి పేరులో అక్షరాల లోపం వలన వివిధ కారణాలవల్ల రుణమాఫీ వర్తించని రైతులు అందరూ దరఖాస్తులు అందించారు. ఈ సందర్భంగా రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కేతావత్ జయరాం, దర్శనం సాయిలు, గోపాల్ రెడ్డి, గొడిసెల యాదగిరి గౌడ్ అనే రైతులు తమ ఆవేదనను V1 న్యూస్ ప్రతినిధికి తెలియజేశారు. అనంతరం ఏఈఓ కే .గోపాల్ మాట్లాడుతూ సాంకేతిక లోపాల వలన మరియు వివిధ కారణాల వలన రుణమాఫీ వర్తించని రైతుల నుండి దరఖాస్తులు మరియు సమాచారం సేకరిస్తున్నామని తెలిపారు. మండల వ్యాప్తంగా రుణమాఫీ కానీ రైతులు ఎవరైనా ఉంటే వెంటనే సంబంధిత వివరాలతో దరఖాస్తులు ఇవ్వాలని సూచించారు. క్లస్టర్ల వారీగా రైతుల వివరాలను గ్రీవెన్స్ ద్వారా పొందుపరుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు అయినాల లింగం, ఎరుకల సుబ్బు, అల్లం రవి, జనపల సాయిలు, అన్నం సత్యనారాయణ, ఇబ్రహీం, సాయిలు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india