V1News Telangana

best news portal development company in india

నసురుల్లాబాద్ ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు….

SHARE:

V1 న్యూస్ నసురుల్లాబాద్ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: నసుల్లాబాద్ మండల కేంద్రంలో గల ప్రభుత్వ జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో గురువారం రోజు 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చందర్ మరియు మండల ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గునిగెరి హన్మండ్లు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్నప్పటికీ చదువుల్లో మరియు ఆటపాటలలో మేము కూడా తీసిపోమంటూ విద్యార్థులు రెట్టింపు ఉత్సాహంతో సాంస్కృతిక కార్యక్రమాలలో మరియు ఉపన్యాసం పోటీలలో, గేయాలు ఆలపించడంలో పోటీ పడుతూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ మాజీ సర్పంచ్ అరిగె సాయిలు మాట్లాడుతూ క్రమశిక్షణతో ఉపాధ్యాయులు బోధించే పాఠాలను శ్రద్దగా విని నేర్చుకోవాలని తెలిపారు. విద్యతోనే మనిషికి సమాజంలో విలువ ఉంటుందని అన్నారు. ఆనాడు మేము విద్యను నేర్చుకోకపోవడం వలన మా గ్రామ పెద్దలు అప్పటి విద్యావంతుల సహకారంతో కొంతవరకు జ్ఞానాన్ని సంపాదించుకున్నామని కొనియాడారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చందర్ మరియు మండల ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు హన్మాండ్లు మండల ప్రజలకు మరియు భారతీయులందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం 2025 వ సంవత్సరం మార్చి నెలలో నిర్వహించిన పదవ తరగతి పరీక్ష ఫలితాలలో పాఠశాల తరఫునుండి ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థికి గోల్డ్ మెడల్ మరియు ద్వితీయ స్థానంలో నిలిచిన విద్యార్థికి సిల్వర్ మెడల్ గ్రామ మాజీ సర్పంచ్ అరిగె సాయిలు వ్యక్తిగతంగా విద్యార్థులను ప్రోత్సహించడానికి బహుకరించారు. ఇదేవిధంగా అందరూ విద్యార్థులు కష్టపడి చదివి గ్రామానికి గొప్ప పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ శంకర్ నాయక్, ప్రభుత్వ పాఠశాల మాజీ చైర్మన్ అల్లం సాయిలు, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు అయినాల లింగం, మాజీ వార్డు సభ్యులు వైదికుల సాయికుమార్, పసుపు సాయిలు, జమాల్ పూర్ లింగం, గ్రామ ప్రజలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india