సాలూరు మండలంలో ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు…
నిజాంబాద్ జిల్లా సాలూరు మండల కేంద్ర ంలో పలు గ్రామాల్లో గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. మండల కేంద్రంలో తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ రమేష్ జాతీయ జెండాను అవిష్కరించారు.
అదేవిధంగా మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు మరియు జాతీయ నాయకుల విగ్రహాల వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో తాసిల్దార్ మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల పోరాటాలను గుర్తు చేశారు.మండల ప్రజలకు 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సాలూరు అధికారులు అనాధికారులు . మరియు .గ్రామ పెద్దలు. తదితరులు పాల్గొన్నారు…
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








