-ప్రతి ఒక్కరిలో దేశభక్తిని పెంపొందించడమే ర్యాలీ ఉద్దేశం
-మన దేశాన్ని మనమే రక్షించుకోవాలి
-బిజెపి మండల అధ్యక్షుడు సున్నం సాయిలు
V1 న్యూస్ నసురుల్లాబాద్ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల కేంద్రంలో బుధవారం రోజు భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు” హర్ ఘర్ తిరంగా”కార్యక్రమంలో భాగంగా భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు సున్నం సాయిలు మరియు హిందూ సంఘాల ఆధ్వర్యంలో జాతీయ జెండాలతో ఘనంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ వ్యాప్తంగా లక్షలాదిమంది ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని ప్రతి ఒక్కరిలో దేశభక్తిని పెంపొందించడమే ఈ ర్యాలీ ఉద్దేశమని తెలిపారు.దేశ సార్వభౌమాధికారాన్ని అందరూ కాపాడాలని అన్నారు. భారతదేశం ప్రపంచంలో అగ్రగామిగా నిలుస్తుందని అందరూ భక్తిశ్రద్ధలతో దేశాన్ని సంఘటితంగా అభివృద్ధి దిశగా తీసుకువెళ్లాలని ప్రతి ఒక్కరూ దేశం కోసం పాటుపడాలన్నారు. మన దేశాన్ని మనమే రక్షించుకోవాలన్నారు. మూడు రోజులపాటు ప్రతి ఒక్కరి ఇంటి పైన జాతీయ జెండా ఎగురవేసి స్వాతంత్ర దినాన్ని ఘనంగా పండగలా జరుపుకోవాలని మన ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుమేరకు అందరూ ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనాలని అన్నారు. గతంలో ప్రభుత్వ కార్యాలయాలలో ఉన్నత అధికారులు, రాజకీయ నాయకులు మాత్రమే జాతీయ పతాకాన్ని ఆవిష్కరించేవారని కానీ ఇప్పుడు ప్రధాని భారతీయ పౌరులందరికీ తమ ఇంటిపై జాతీయ పతాక ఆవిష్కరణ నిర్వహించుకోవడానికి అవకాశం కల్పించి భారతదేశ ఔన్నత్యాన్ని, నాగరికతను ప్రపంచం నలుమూలల చాటే విధంగా నిర్ణయం తీసుకున్నారు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షుడు అనుసూరి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మేకల రాములు, కిసాన్ మోర్చా అధ్యక్షుడు గొడిసెల యాదగిరి గౌడ్, యువ మోర్చా అధ్యక్షుడు మహేష్, దళిత మోర్చా అధ్యక్షుడు శేఖర్, బూత్ అధ్యక్షులు కంది పెద్ద మల్లేష్, ఉల్లెంగ గోపి, కార్యకర్తలు కొప్పుల సాయిలు, పవన్, సాయి, పర్వయ్య, కృష్ణ, కూని సాయ గౌడ్, పాఠశాల విద్యార్థిని విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








