V1News Telangana

best news portal development company in india

మంధర్ణతోపాటు ఇతర గ్రామాలనుంచి ప్రతిరోజు రాత్రి జోరుగా ఇసుక అక్రమ రవాణా రెవెన్యూ తో పాటు పోలీసు అధికారులే మామూలు తీసుకుని దగ్గరుండి పంపిస్తున్నారు అన్న భారీ అనుమానాలు, విమర్శలు

SHARE:

రాత్రి అయిందంటే ఇసుక మాఫియా దారులకు పండుగే పండుగ
అధిక లోడుతో టిప్పర్ల ద్వారా ఇసుక నిజాంబాద్ కు అక్రమ రవాణా
మంధర్ణతోపాటు ఇతర గ్రామాలనుంచి ప్రతిరోజు రాత్రి జోరుగా ఇసుక అక్రమ రవాణా
రెవెన్యూ తో పాటు పోలీసు అధికారులే మామూలు తీసుకుని దగ్గరుండి పంపిస్తున్నారు అన్న భారీ అనుమానాలు, విమర్శలు


బోధన్
నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం అదేవిధంగా సాలుర మండలం మంజీర సరిహద్దు ప్రాంతాలు, మందర్న గ్రామ మంజీరా శివారుతో పాటు చుట్టుపక్క గ్రామాలలో ఉన్న మంజీర శివారు ప్రాంతాల నుంచి, ప్రతిరోజు రాత్రి అయిందంటే ఇసుక మాఫిదారులు, పండుగే పండుగ చేసుకుంటున్నారని, ట్విప్పర్ల ద్వారా అదేవిధంగా లారీల ద్వారా అధిక లోడుతో ఇసుక అక్రమంగా బోధన్ పట్టణం తో పాటు నిజాంబాద్ కు భారీగా తరలిస్తున్నారని, అరికట్టవలసిన రెవెన్యూ అధికారులు అదేవిధంగా పోలీసు అధికారులు దగ్గరుండి, ప్రతిరోజు భారీగా మామూలు వసూలు చేసుకుంటున్నారని విమర్శలు, అనుమానాలు జోరుగా వినిపిస్తున్నాయి, ఇసుక బంగారం వల్ల రెవెన్యూ అధికారులు పోలీసు అధికారులు భారీగా ముడుపులు తీసుకుంటున్నారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రతిరోజు పదుల నుంచి వందల సంఖ్యలో ట్రాక్టర్లు ట్రిప్పర్ల ద్వారా వివిధ గ్రామాలు వివిధ పట్టణాలతో పాటు నిజామాబాద్ తో పాటు హైదరాబాద్కు ఇసుక జోరుగా తరులుతుందని ప్రజలు విమర్శలు చేస్తున్నారు. దీనిపై దృష్టి పెట్టాల్సిన సంబంధిత శాఖ అధికారులు భారీగా మామూలు తీసుకుంటూ అటువైపు కన్నెత్తి చూడడం లేదని విమర్శలు లేకపోలేదు. రహస్య ప్రదేశాలలో సంబంధిత సంబంధిత శాఖ అధికారులు ఇసుక మాఫియా దారులతో మీటింగ్ చేసుకొని ముడుపులు తీసుకుంటున్న వైనం డీలింగ్ చేసుకుంటున్న వైనం కొనసాగుతుందని ఇప్పటికైనా వాల్టా చట్టానికి తూట్లు పడవకుండా ఇసుక మాఫిను ఆపాలని ప్రజలు కోరుతున్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india