V1News Telangana

best news portal development company in india

ఆశ్రమంలోని చిన్నారులకి అన్నదానం, మరియు 75 కేజీల బియ్యం అందజేత

SHARE:

తభితా ఆశ్రమంలో ఘనంగా బాల్య మిత్రుడి జన్మదిన వేడుకలు

ఆశ్రమంలోని చిన్నారులకి అన్నదానం, మరియు 75 కేజీల బియ్యం అందజేత

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిజెపి నాయకులు కందుల సంధ్యారాణి

V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది రామగుండం ఆగస్టు 05:-

విలేజ్ రామగుండం ప్రాంతానికి చెందిన భాగ్యనగరపు రాజాబాబు వృత్తిరిత్యా ఆస్ట్రేలియాలో స్థిరపడ్డా, తన మిత్రులంతా కలిసి స్నేహితుల దినోత్సవం సంధర్బంగా వారి జన్మదినాన్ని స్థానిక తభితా ఆశ్రమంలోని చిన్నారుల మధ్య ఘనంగా నిర్వహించారు..వారి పుట్టినరోజు సందర్భంగా గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రామగుండంలోని తబిత ఆశ్రమ పిల్లలకు 75 కేజీల బియ్యాన్ని అందజేసి,అనంతరం చిన్నారులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సేవా కార్యక్రమానికి బిజెపి నేత కందుల సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరై, వారి చేతుల మీదుగా ఆశ్రమంలోని చిన్నారులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ రాజబాబు  పుట్టిన ప్రాంతానికి, సమాజానికి సేవ చేయాలనే దృఢ సంకల్పం కలిగి ఉన్న వ్యక్తి అన్నారు..వారు గొప్ప గొప్ప సేవా కార్యక్రమాలను కొనసాగిస్తుండడం అభినందనీయమని, హర్షనీయమని ప్రశంసించారు. వారి జన్మదినం సందర్భంగా మిత్రులంతా కలిసి వారి జన్మదిన వేడుకలను తభిత ఆశ్రమంలోని చిన్నారుల మధ్య నిర్వహించడం హర్షించదగ్గ విషయం అన్నారు..ఈ కార్యక్రమాన్ని వారి మిత్రుడు కందుల పోచం బాల్య మిత్రులతో కలిసి ఆశ్రమంలో నిర్వహించడం అభినందించదగ్గ విషయం అన్నారు.వీరి మిత్ర బృందాన్ని మిగితావారు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు..రాజాబాబు భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానానికి చేరుకొని, ఈ ప్రాంతానికి వారి సేవలని అంధించాలని కోరుకున్నారు…ఈ సేవా కార్యక్రమంలో మహ్మద్ సలీం, కందుల సత్యనారాయణ , తూల రాజనర్సయ్య, నర్సింగరావు, రాపోలు రవీందర్ రావు, కలవేణి మల్లేశం, జోసెఫ్, శేషు,అల్లేపు సారయ్య,చిలువేరు కుమార్,శ్రీకాంత్,ప్రసాద్ తదితరులు పాల్గోన్నారు…

Namani Rakesh Netha
Author: Namani Rakesh Netha

STAFF REPORTER RAMAGUNDAM

best news portal development company in india