-ఎస్సీ వర్గీకరణ విజయం అమరులు, ఉద్యమకారులకు అంకితం
-ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ
V1 న్యూస్ నసురుల్లాబాద్ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా:నసురుల్లాబాద్ మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తాలో శుక్రవారం రోజు రోజు ఎస్సీ వర్గీకరణ పై భారతదేశ అత్యున్నత న్యాయస్థానం,సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు రిజర్వేషన్ల అంశంపై వర్గీకరణ అధికారం కలిపిస్తూ తీర్పు ఇవ్వడంతో ఎమ్మార్పీఎస్, బిజెపి దళిత సంఘం నాయకులు, బాబు జగ్జీవన్ రావ్ సంఘం నాయకులు అందరూ కలిసి ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మిఠాయిలు పంచుతూ, బాణాసంచా కాల్చి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు గరుగల్ల బాలరాజ్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం 30 ఏళ్లుగా అలుపెరుగని పోరాటం చేస్తూ నేటికి చరిత్రలో నిలిచిపోయిందని.. మాదిగల చిరకాల పోరాటానికి ఫలితం దక్కిందన్నారు. ఈ విజయాన్ని ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరులకు మరియు వర్గీకరణ ఉద్యమంలో పాల్గొని సహకరించిన ఉద్యమకారులకు అంకితమిస్తున్నామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్న మాటలను గుర్తు చేశారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన తర్వాత ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారని అన్నారు. ఈ పోరాటంలో ఎమ్మార్పీఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కృషి ఎంతో ఉందని కొనియాడారు. మాదిగలను ఈ పోరాటంలో చైతన్యవంతులను చేసి తరతరాలుగా అణచివేతకు గురవుతున్న మాదిగ సామాజిక వర్గాన్ని సమాజంలో గౌరవ మర్యాదలతో బ్రతికే విధంగా మార్గ నిర్దేశకుడు అయ్యాడని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు గరుగల్ల బాలరాజు , మండల బిజెపి అధ్యక్షులు సున్నం సాయిలు, బీజేపీ దళిత మండల అధ్యక్షుడు టేకుర్ల శేఖర్ , ఎమ్మార్పీఎస్ మండల కమిటీ సభ్యుడు టేకుర్ల సాయిలు,మావురం శ్రీకాంత్, బిజెపి కార్యకర్తలు, బాబు జగ్జీవన్ రావ్ వారసులు, ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








