V1News Telangana

best news portal development company in india

ప్రజల నడ్డి విరుస్తున్న పాలకవర్గం కార్పొరేషన్… గుంతలు పడ్డ రోడ్లకు మరమ్మత్తు కరువు 

SHARE:

ప్రజల నడ్డి విరుస్తున్న పాలకవర్గం కార్పొరేషన్

గుంతలు పడ్డ రోడ్లకు మరమ్మత్తు కరువు

V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది రామగుండం జూలై 26:-

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లోని కళ్యాణ్ నగర్ వ్యాపార కూడలిలో గుంతలపడ్డ రోడ్లు పట్టించుకోని కార్పొరేషన్ కళ్యాణ్ నగర్ చౌరస్తా నుండి లక్ష్మీ నగర్ పోయే దారిలో రోడ్లు మొత్తం గుంతలు పడి ప్రజల నడ్డి విరిగే పరిస్థితి వచ్చింది. కురుస్తున్న వర్షాలకు రోడ్లు మొత్తం నీళ్లు జమై రోడ్ లేవో గుంతలేవో అర్థం కాని పరిస్థితి నెలకొంది దీనివల్ల ప్రజలు అటువైపు రావాలంటే జంకుతున్నారు. గతంలో అభివృద్ధిలో భాగంగా రోడ్డును తవ్వి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైపులను వేశారు అయితే అది తాత్కాలికంగా తవ్విన మట్టితోనే పూడ్చారు. అయినప్పటికీ దానిపై రోడ్డు నిర్మాణం ఇప్పటివరకు చేపట్టలేదు దీనిపై కార్పొరేషన్ అధికారులు కానీ స్థానిక పాలకవర్గం స్పందించకపోవడం ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై కార్పొరేషన్ అధికారులు స్థానిక పాలకవర్గం స్పందించి గుంతలు పడ్డ రోడ్డును మరమ్మతి చేయాలని ప్రజలు మరియు వ్యాపారస్తులు కోరుతున్నారు.

Namani Rakesh Netha
Author: Namani Rakesh Netha

STAFF REPORTER RAMAGUNDAM

best news portal development company in india