V1News Telangana

best news portal development company in india

మైలారం గ్రామంలో ఘనంగా మైసమ్మ తల్లి పండుగ….

SHARE:

V1 న్యూస్ నసురుల్లాబాద్ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా:నస్రుల్లాబాద్ మండలం మైలారం గ్రామంలో గురువారం రోజు కొచ్చేరు మైసమ్మ పండుగను గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉదయం నుండి మహిళలు భక్తిశ్రద్ధలతో బోనాలను అలంకరించి నాలుగు కిలోమీటర్ల మేర కాలినడకన నడుచుకుంటూ వెళ్ళి ప్రకృతి ఒడిలో కొలువై ఉన్న కొచ్చేరు మైసమ్మ ఆలయం వద్ద అమ్మవారికి బోనాలను మరియు నైవేద్యం సమర్పించారు. సుమారు 200 వందల ఏళ్ల చరిత్ర కలిగి మర్రిచెట్టు కింద గుడి లేకుండా వెలసినటువంటి అమ్మవారికి ప్రతి ఏడు ఆషాడ మాసం పౌర్ణమి తర్వాత చివరి శుక్రవారం నాడు బోనాల పండుగ జరుపుతామని గ్రామ ప్రజలు తెలిపారు. గురువారం రోజు బోనాలను అమ్మవారికి సమర్పించి శుక్రవారం నాడు అమ్మవారికి నైవేద్యాలను సమర్పించి గ్రామ ప్రజలు మొక్కులు తీర్చుకుంటారని తెలిపారు. గ్రామ ప్రజలు ఆయురారోగ్యాలతో మరియు పాడిపంటలు, పశువులు సుభిక్షంగా ఉండాలని ప్రతి ఇంటిలోనూ అమ్మవారిని నెలకొల్పుకొని వివిధ గ్రామాల్లో గల తమ బంధువులను పిలుచుకొని పండుగను ఘనంగా జరుపుకుంటామని గ్రామ పెద్దలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు సాయిరాం యాదవ్, మహేందర్, బాల హరిచంద్ర రెడ్డి ,జగన్, భాస్కర్, శంకర్ ,రాజు, రాము, వెంకటి తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india