మహిళలు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ద కనబర్చాలి……. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీ
ఎన్టిపిసి , రామగుండం జూలై-24:V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది రామగుండం
మహిళలు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ద కనబర్చాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీ అన్నారు.బుధవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీ ఎన్టిపిసి పెర్మనెంట్ టౌన్షిప్ లో మహిళ సాధికారత కార్యక్రమంలో భాగంగా మహిళ, యువకుల ఆరోగ్య సమస్యల పై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు, గర్భిణీలు, గర్భస్థ క్యాన్సర్ ఇతర ఆరోగ్య సమస్యలను వివరించారు. ముఖ్యంగా యువతుల బుతుక్రమ సమస్యలు, శుభ్రతపై అవగాహన కల్పించారు. మహిళలు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని నిర్లక్ష్యం చేయవద్దని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి రావూఫ్ ఖాన్, జిల్లా పంచాయతీ శాఖ అధికారి ఆశలత డిప్యూటీ డిఎంహెచ్ఓ అన్న ప్రసన్న, మెడికల్ ప్రొఫెసర్ శ్రీదేవి, జిల్లా మహిళా సాధికారత నిర్వాహకురాలు దయ అరుణ, పెద్దపెల్లి సిడిపిఓ కవిత, రామగుండం సిడిపిఓ స్వరూప రాణి, బాల రక్షణ భవన్ సుగుణ ,కమలాకర్, పోషణ అభియాన్ కోఆర్డినేటర్ అనిల్ కుమార్, సఖి కోఆర్డినేటర్ స్వప్న, డిహెచ్ఈఎం సభ్యులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Author: Namani Rakesh Netha
STAFF REPORTER RAMAGUNDAM