V1News Telangana

best news portal development company in india

లక్ష లోపు రుణం తీసుకున్న ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ జరగాలి

SHARE:

– బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి చందూరి హన్మాండ్లు

V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: రాష్ట్ర ప్రభుత్వం లక్షలోపు రైతుల పంట రుణమాఫీ చేశామని సంబరాలు మరియు పాలాభిషేకం జరుపుకున్నప్పటికీ కేవలం 25 శాతం మంది రైతులకు మాత్రమే లక్ష లోపు రుణమాఫీ జరిగిందని బిజెపి పార్టీ జిల్లా అధికార ప్రతినిధి చందూరి హన్మండ్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 35 లక్షల పైచిలుకు రైతులు లక్షలోపు రుణం తీసుకున్న వారు ఉంటే కేవలం 11,50,000 మంది రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగిందని అన్నారు. మిగిలిన రైతులకు రుణమాఫీ జరగలేదని వీరికి రుణమాఫీ విషయంలో బ్యాంకర్లు గాని, వ్యవసాయ అధికారులు గానీ స్పష్టత ఇవ్వడం లేదన్నారు. మిగిలిన రైతులకు కూడా రుణమాఫీ జరిగే విధంగా ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. శాసనసభ ఎన్నికల సమయంలో.. ఎన్నికల మ్యానిఫెస్టో లో ఎటువంటి నిబంధనలు లేకుండా రుణ మాఫీ చేస్తామని ప్రగల్బాలు పలికి.. ఇప్పుడు ఈ విధంగా నిబంధనల పేరుతో రైతులను మోసగించడమే అవుతుందన్నారు. అదేవిధంగా రుణమాఫీ జరిగిన రైతులకు కూడా బ్యాంకు ఖాతాలలో డబ్బులు సరిగా పడడం లేదు అని తెలిపారు. వడ్డీ చెల్లిస్తేనే మాఫీ జరుగుతుందని ఈ విషయంలో ప్రభుత్వం తమకేమి పట్టనట్టుగా వ్యవహరిస్తుందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకర్ల నుండి లక్ష లోపు రుణాలు ఉన్న రైతుల పూర్తి జాబితాను తీసుకొని అందరికీ రుణమాఫీ జరిగే విధంగా చూడాలని డిమాండ్ చేశారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india