V1News Telangana

ఆర్ ఎఫ్ సి ఎల్ లో బ్యాగింగ్ లిఫ్టర్ పడిపోయి ప్రమాదం … సేఫ్టీ నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం ప్రమాదం జరిగిన సమాచారం ఇవ్వని అధికారులు

ఆర్ ఎఫ్ సి ఎల్ లో బ్యాగింగ్ లిఫ్టర్ పడిపోయి ప్రమాదం

సేఫ్టీ నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం ప్రమాదం జరిగిన సమాచారం ఇవ్వని అధికారులు

V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది రామగుండం జూలై 24:-

రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఆర్ ఎఫ్ సి ఎల్ లో బుధవారం తెల్లవారుజామున 3 గంటలకు బ్యాగింగ్ సెక్షన్ లో జూల లిఫ్టర్ తెగి పడిపోయినా ప్రమాదం జరిగింది. ఇంత జరిగిన ఈ సంఘటనపై ఆర్ ఎఫ్ సి ఎల్ అధికారులు గోప్యత వ్యవహరిస్తున్నట్లు సమాచారం. మెకానికల్ సేఫ్టీ నిర్లక్ష్యంతో ఈ ప్రమాదం జరిగినట్లు విశ్వాసనీయమైన సమాచారం. ఆర్ ఎఫ్ సి ఎల్ కర్మాగారంలో అధికారులు ప్రమాదంపై గోప్యంగా ఉంచడం పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సరైన సేఫ్టీ లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ఇంత జరిగిన బయటికి రానీయకపోవడం అనేక అనుమానాలకు దారితీస్తుంది. ఈ సంఘటన జరిగే సమయంలో కార్మికులు అక్కడ లేకపోవడంతో ఏలాంటి ప్రమాదం జరగలేదు. అయితే హడావుడిగా జూల లిఫ్టర్ మరమ్మత్తు పనులు ప్రారంభించారు దీనిపై ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Namani Rakesh Netha
Author: Namani Rakesh Netha

STAFF REPORTER RAMAGUNDAM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

7k Network

Vote Here

[democracy id="1"]

Recent Post