V1News Telangana

best news portal development company in india

పోచారం భాస్కర్ రెడ్డి వీరాభిమాని అశోక్ చేతుల మీదుగా విద్యార్థులకు నోట్ బుక్ లు పంపిణీ మరియు చెట్లు నాటుట…..

SHARE:

V1 న్యూస్ నసురుల్లాబాద్ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండలంలోని లింగంపల్లి తాండ గ్రామంలో మంగళవారం రోజు మాజీ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆయన వీరాభిమాని అశోక్ మరియు తన మిత్ర బృందంతో కలిసి ఆంజనేయస్వామి మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మిఠాయిలు మరియు నోట్ బుక్ లు పంపిణీ చేశారు. ఈ క్రమంలో గ్రామంలో పలుచోట్ల మొక్కలను నాటారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ పోచారం భాస్కర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వెలుగొందాలని ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. ఆయన ఎదుగుదలకు చిహ్నంగా మొక్కలను నాటామని రాజకీయంగా ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ ఎన్నో ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో బాన్సువాడ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలుపొంది, మంత్రివర్గంలో కూడా చోటు సంపాదించుకొని ప్రజాసేవలో భాగస్వామ్యం కావాలని తిరుగులేని నాయకుడిగా ప్రజల మన్ననలు పొందాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు. ఆయన వెంట లక్ష్మణ్ ,రాము రాథోడ్ ,జాదవ్ శ్రీనివాస్ ,అరుణ్, ప్రశాంత్ ,సందీప్ ,కోడంరాజు ,బట్టు మోహన్, హజార్ ,తిరుమలరెడ్డి, హైమద్ ,విట్టల్ పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india