V1News Telangana

best news portal development company in india

శిశువు మృత దేహం తో ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా.

SHARE:

బోధన్. ప్రభుత్వ .ఆసుపత్రులలో డాక్టర్ ల కొరతను నిరసిస్తూమృతి చెందిన శిశువు తో సన్నిహితులు నిజాంమాబాద్ జిల్లా బోధన్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

బోధన్ పట్టణం లోని అచన్ పల్లి గ్రామానికి చెందిన యువతి ప్రసవం కోసం జిల్లాకేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది. ఆసుపత్రిలో చేర్పించుకున్న సిబ్బంది కొన్ని గంటల అనంతరం వైద్యులు లేరని జిల్లా కేంద్రం లోని ఆసుపత్రి కి తరలించాలని సూచన చేశారు. అప్పటికే యువతికి పురిటి నొప్పులు ఎక్కువగా ఉన్నాయని వెంటనే జిల్లా కేంద్రం లోని ఆసుపత్రి కి తరలించాలని లేని పక్షం లో తల్లి ప్రాణానికే ముప్పు వాటిల్లే అవకాశం ఉందని సిబ్బంది యువతి బంధువులపై వత్తిడి తీసుకు వచ్చారు. జిల్లా కేంద్రం వెళ్లే సమయం లో ప్రమాదం కలుగుతుందనే భయం తో యువతి బందువులు బోధన్ లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రైవేటు ఆసుపత్రిలో ఆపరేషన్ చేసి మృతి చెందిన శిశువును తీశారు. శిశువు మృతి చెందడంతో ఒక్క సారిగా యువతి బందువులలో ఆగ్రహం వ్యక్తం అయింది. శిశువు మృత దేహాన్ని తీసుకుని ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. శిశువు మృతికి బాధ్యులు ఎవరని ఆర్డీఓ రాజేశ్వర్ ను నిలదీశారు. ఆర్డీఓ కార్యాలయానికి పోలీసులు చేరుకుని బాధితులకు నచ్చచెప్పడం తో ఆందోళన విరమించారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india