V1News Telangana

best news portal development company in india

కోపర్గా హంగర్ గా గ్రామాల్లో అనేక చోట్ల భారీగా ఇసుక డంపు చాలామంది ఇంటి ముందే ఇసుక డంపు ఇసుక తవ్వకాల కోసం ప్రత్యేక వాహనాలు ఇసుక డంపు చేసుకుంటారు అనంతరం అమ్ముకుంటారు…

SHARE:

బోధన్
నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం కోపర్గా హాంగర్గా గ్రామంలో చాలాచోట్ల ఇసుక డంపు భారీగా ఉంది అంటూ ప్రజలు ఆరోపిస్తున్నారు. చాలామంది ఇంటి ఎదుట ఇసుక త్రవ్వకాలు చేసే ప్రత్యేక వాహనాలతో పాటు ఇసుక డంపు భారీగా ఉందని ప్రజలు విమర్శలు చేస్తున్నారు.

ప్రతి ఏటా ప్రత్యేక వాహనం ద్వారా ఇసుక డంపు చేసుకొని ఇంటి ఎదుట లేదా కొద్ది ప్రదేశాలలో వ్యవసాయ భూములలో, రహస్య ప్రదేశాల్లో ఇసుక డంపు ఉంచుతారని, ఇసుక పట్టణాలు పల్లెలు అవసరమైతే హైదరాబాద్ వరకు కూడా అవసరమైతే తరలించి అధికారేట్లకు విక్రయించి భారీగా సొమ్ము చేసుకుంటున్నారని ప్రజలు విమర్శలు చేస్తున్నారు., ఇసుక త్రవ్వకాలు డంపు చేయడం అమ్మకాలు ఆనవాయితీగా ఆ గ్రామాల్లో జరుగుతుందని వీటితో పాటు  అనేక గ్రామాల్లో జరుగుతుందని విమర్శలు కూడా లేకపోలేదు. బహిర్గతంగా విచ్చలవిడిగా ఇసుక డంపు భారీగా ఉన్నప్పటికీ వీటిపై సంబంధిత శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నారని ప్రజలు మండిపడుతున్నారు. ఇసుక త్రవ్వకాలు డంపు చేసి అమ్మకాల వల్ల వాళ్తా చట్టానికి తూట్లు పడుతున్నాయని భూగర్భ జలాలు అడుగంటిపోయి వ్యవసాయ దారుల భూములలో ఉన్న బోర్లు అడుగంటిపోయి నీరు అందని పరిస్థితి ఏర్పడుతుందని ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఇసుక డంపు పై చర్యలు తీసుకొని, స్వాధీనం చేసుకొని ప్రభుత్వ ఆదాయానికి మార్గాలు సంబంధిత శాఖ అధికారులు చూపాలని, ప్రజలు కోరుతున్నారు, ప్రకృతి వనాలను సహజ వనరులను కాపాడవలసిన అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడకుండా బడా బాబులు , ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీ నాయకులు పాలకుల ఒత్తిడికి లోనై లేక వారి నుంచి మామూలు తీసుకొని అటువైపు కన్నెత్తి చూడకుండా, పరోక్షంగా వాటిని దాటించి వారికి సపోర్ట్ చేస్తూ మామూలు తీసుకుంటూ, వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. ఇసుక తరలింపులో అధికారులే ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు.
V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india