V1News Telangana

best news portal development company in india

అంగన్వాడి కేంద్రం పరిశీలన మరియు “వనమహోత్సవం” కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రత్యేక అధికారి….

SHARE:

V1 న్యూస్ నసురుల్లాబాద్ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండలంలోని అంకోల్ తాండ గ్రామంలో గల అంగన్వాడి కేంద్రాన్ని మంగళవారం రోజు ప్రత్యేక అధికారి టి .దయానంద్ ఆకస్మిక సందర్శించి పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రంలో గల రికార్డులను తనిఖీ చేసి పిల్లలు ఎదుగుదలకు పౌష్టికాహారం ఇవ్వడం ఎంతో ముఖ్యమని అంగన్వాడి సిబ్బందికి సూచించారు. ప్రభుత్వం సూచించిన మెనూ ప్రకారం పిల్లలకు మరియు గర్భిణీ స్త్రీలకు ఆహారాన్ని అందించాలని తెలిపారు. అంగన్వాడి కేంద్రంలో గల రికార్డులను తనిఖీ చేసి అనంతరం పిల్లలతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం సంగం గ్రామపంచాయతీ పరిధిలో గల కాలువ కట్టపై” వన మహోత్సవం” లో భాగంగా ఉపాధి హామీ కూలీలతో కలిసి చెట్లను నాటి వాటికి నీరు అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ రాము, ఏపీవో సౌజన్య, టెక్నికల్ అసిస్టెంట్, పంచాయతీ కార్యదర్శి, ఫీల్డ్ అసిస్టెంట్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india