V1News Telangana

best news portal development company in india

“విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమానికి ప్రజల నుండి స్పందన కరువు …..

SHARE:

V1 న్యూస్ నసురుల్లాబాద్ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల కేంద్రంలో గల సబ్ స్టేషన్ లో మంగళవారం రోజు విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో “విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక “కార్యక్రమానికి ప్రజల నుండి స్పందన కరువైంది .. స్థానికంగా విధులు నిర్వహిస్తున్న అధికారులు ప్రజలకు కార్యక్రమం గురించి అవగాహన కల్పించడంలో విఫలం అయ్యారని అనడంలో అతిశయోక్తి లేదు మండల వ్యాప్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో కేవలం నాలుగు ఫిర్యాదులు(దరఖాస్తులు) మాత్రమే రావడం విడ్డూరం. నిత్యం పదుల సంఖ్యలో కరెంటు కోతలు, ప్రతి వీధిలో విద్యుత్ లైన్ల సమస్యలు ఉన్నప్పటికీ ఉన్నతాధికారుల దృష్టికి ఎక్కడ ప్రజలు తీసుకెళ్తారా అన్న ఉద్దేశంతో స్థానికంగా ఉన్న అధికారులు ప్రజలకు అవగాహన కల్పించడంలో విఫలం చెందారు. ప్రతి గ్రామంలోనూ దండోరా వేయించాల్సి ఉండగా ఏ ఒక్క గ్రామంలోనూ దండోరా వేయించకుండా ప్రజలకు ఈ కార్యక్రమం ఉందన్న విషయాన్ని వివరించలేకపోయారు. తమ విధి నిర్వహణ నిర్లక్ష్యం ఉన్నతాధికారుల దృష్టికి వెళుతుందన్న ఉద్దేశంతోనే ప్రజలను స్థానికంగా ఉన్న అధికారులు సమన్వయపర్చలేకపోయారు. స్థానికంగా ఉన్న అధికారులు విధులలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లినప్పటికీ వారు కూడా మామూలుగా వ్యవహరించే తీరుపై ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా స్థాయి అధికారులు డివిజన్ ,మండల స్థాయి అధికారులపై చర్యలు తీసుకొని ప్రజలకు విద్యుత్ సరఫరా సమస్యలు తలెత్తకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india