V1News Telangana

best news portal development company in india

లయన్స్ క్లబ్ బీర్కూర్ వారి ఆధ్వర్యంలో కంటి చూపు వైద్య పరీక్షల నిర్వహణ

SHARE:

V1 న్యూస్ బీర్కూర్ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: లయన్స్ క్లబ్ బీర్కూర్ వారి ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం రోజు నిర్వహించే కంటి చికిత్స కార్యక్రమంలో భాగంగా బీర్కూర్ మండలంలోని దామరంచ గ్రామంలో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు కంటి చూపు సమస్యలతో బాధపడుతున్న వారికి ప్రాథమిక పరీక్షలు నిర్వహించారు. అనంతరం బీర్కూరు మండల కేంద్రంలో గల లయన్స్ క్లబ్ కేంద్రంలో కంటి చూపు పరీక్షలు నిర్వహించారు. మొత్తంగా 60 మంది కంటి చూపుతో బాధపడే వారికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు వారు తెలిపారు. అందులో మూడు ఐఓఎల్ సర్జరీలను బోధన్ లో గల లయన్స్ కంటి ఆసుపత్రికి ప్రతిపాదించి వారిని అక్కడికి వెళ్లి ఆపరేషన్ చేయించుకోవాల్సిందిగా సూచించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు మేకల గాలయ్య, కోశాధికారి డాక్టర్ రమేష్ సితాలే, సీనియర్ లయన్స్ క్లబ్ సభ్యుడు కొత్తూరు సంతోష్ కుమార్ గుప్త, మన్నెం కిషోర్, పెండ్యాల రమేష్, గాండ్ల సాయి కృష్ణ మరియు వైద్య బృందం తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india