V1News Telangana

best news portal development company in india

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే….

SHARE:

V1 న్యూస్ వర్ని ప్రతినిధి:

నిజామాబాద్ జిల్లా: బాన్సువాడ నియోజకవర్గం పరిధిలోని రుద్రూర్, వర్ని, చందూర్, మోస్రా మండలాలకు చెందిన 106 కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మంగళవారం రోజు మాజీ శాసనసభ సభాపతి, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన ప్రభుత్వం ఏర్పాటు కావడం వలన కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణీలో జాప్యం జరిగిందని ఆయన అన్నారు. పేద ప్రజల కు వరంగా ఉన్నటువంటి ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో నిర్వర్తిస్తుందని ఆయన తెలిపారు. భవిష్యత్తులో ప్రజలు ఎటువంటి అపోహలకు గురికా వద్దని ప్రభుత్వం పేద ప్రజల అభ్యున్నతికి పాటుపడే విధంగా తగిన ప్రణాళికలతో ముందుకు వెళుతుందని తెలియజేశారు. వర్ని మండల కేంద్రంలోని సి సి డి కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో బోధన్ ఆర్డీవో, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india