-కళాశాల పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలి
-మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ
కామారెడ్డి జిల్లా: కామారెడ్డి పట్టణ కేంద్రంలో గల ప్రభుత్వ మెడికల్ కళాశాలను మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ సోమవారం రోజు ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కళాశాలలో ఉన్నటువంటి సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. తరగతి గదులు మరియు హాస్టల్ వసతులు ఎలా ఉన్నాయని ఆరా తీశారు. మెడికల్ కళాశాల పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. కళాశాలకు మంచినీటి సౌకర్యం అందిస్తామని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ఆమెతోపాటు కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయ బృందం, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








