V1News Telangana

best news portal development company in india

గ్రామాలలో విద్యుత్ సరఫరా లో అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలి….

SHARE:

-రైతులకు పంటల సాగుకు విద్యుత్ సరఫరా సక్రమంగా అందించాలి

-ఎమ్మెల్యే కె.వెంకట్రామిరెడ్డి సూచనలు

V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: కామారెడ్డి పట్టణ కేంద్రంలో గల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి సంబంధించి సోమవారం రోజు ఉదయం విద్యుత్ శాఖ అధికారులు ఎస్ఈ, డిఈ, ఎఫ్ఎం, సీనియర్ లైన్మెన్ లు, లైన్మెన్లు, లైన్ ఇన్స్పెక్టర్లు, అసిస్టెంట్ లైన్ ఇన్స్పెక్టర్లు, ఎంపీడీవోలు, ఎంపీఓ లతో ఎమ్మెల్యే కే వెంకటరామిరెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్యుత్ అధికారులు రైతులకు బోరు బావుల వద్ద విద్యుత్ సరఫరా సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. వర్షాల వల్ల ట్రాన్స్ఫార్మర్ల వద్ద సమస్యలు తలెత్తినప్పుడు త్వరితగతిన పరిష్కరించి విద్యుత్ సరఫరా అందించి రైతులకు పంటల సాగుకు సహకరించాలని తెలిపారు. గృహ వినియోగాలకు విద్యుత్తు అంతరాయం కలగకుండా ఫ్రీ మాన్ సూన్ పనులు చేపట్టి సమస్యలు తలెత్తకుండా చూడాలని అన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india