-ప్రజల గుండెలలో చిరస్థాయిగా నిలిచిపోయిన నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి
-మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ వ్యాఖ్యలు
V1 న్యూస్ బాన్సువాడ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: బాన్సువాడ పట్టణంలో సోమవారం రోజు మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేద ప్రజల అభ్యున్నతికి ఎంతగానో పాటుపడ్డాడని గుర్తు చేసుకున్నారు. ప్రజలకు ఆరోగ్య శ్రీ పథకం మరియు 108, 104 సేవలు, పేదలకు పెన్షన్ పెంపు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ మరియు విదేశాలలో విద్యనభ్యసించే విద్యార్థులకు స్థాయిఫండ్ రూపంలో ఆర్థిక సహాయం, మైనారిటీలకు రిజర్వేషన్లు మరియు నూతన నీటి నిర్మాణం, ఎత్తిపోతల పథకాలు వంటి ప్రజలకు ఉపయోగపడే ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని అన్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతికి పాటుపడిన గొప్ప నాయకుడని కొనియాడారు. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు మరియు పరిపాలన దక్షత కారణంగా ఎప్పటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ నాయకులు జిల్లా మైనారిటీ అధ్యక్షులు మొహమ్మద్ అబ్దుల్ కాలిక్, బాన్సువాడ మున్సిపాలిటీ చైర్మన్ జంగం గంగాధర్, సొసైటీ చైర్మన్ ఎర్వల కృష్ణారెడ్డి, అంజిరెడ్డి, ఎజాజ్, మున్సిపల్ కౌన్సిలర్ కాసుల రోహిత్, నందకిషోర్, అమర్, మాజీ ఏఎంసీ చైర్మన్ నార్ల సురేష్ గుప్తా, అధికార ప్రతినిధి గుడాల నగేష్, నార్ల ఉదయ్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








