V1News Telangana

best news portal development company in india

ప్రజావాణి “ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలి…

SHARE:

-జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: “ప్రజావాణి” కార్యక్రమంలో భాగంగా సోమవారం రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ వివిధ మండలాల నుండి వచ్చిన ప్రజల నుండి పలు ఫిర్యాదులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో” ప్రజావాణి” ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. విధినిర్వహణలో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్య, వైద్యము, విద్యుత్ శాఖ, పంచాయతీ శాఖ, గిరిజన సంక్షేమం, బీసీ సంక్షేమం, పెన్షన్లు, ధరణి, ఆపద్బాందు, మున్సిపాలిటీ, మైనింగ్, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు తదితర అంశాలకు సంబంధించి 114 ఫిర్యాదులు అందినట్లు ఆయన తెలిపారు. ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఫిర్యాదుదారుని మండలానికి చెందిన సంబంధిత అధికారులతో అప్పటికప్పుడు మాట్లాడి సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. సమస్యల పరిష్కారంలో జాప్యం జరిగినట్లయితే తగిన చర్యలు తీసుకుంటామన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india