Post Views: 59
V1 న్యూస్ నసురుల్లాబాద్ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండలంలోని దుర్కి గ్రామంలో ఎమ్మార్పీఎస్ 30 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎమ్మార్పీఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. దళితుల అభ్యున్నతి కొరకు మంద కృష్ణ మాదిగ ఎమ్మార్పీఎస్ పార్టీని స్థాపించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా కోఆర్డినేటర్ గరుగళ్ల బాలరాజు, నసురుల్లాబాద్ మండల ఇన్చార్జ్ సాయిలు, వీరయ్య, శ్రీనివాస్, శ్రీకాంత్, లక్ష్మణ్, రాము, మావురం సాయిలు, ముసురుగళ్ల హన్మండ్లు, చిన్న పీరయ్య తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








