V1News Telangana

best news portal development company in india

ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించిన రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్….

SHARE:

-ప్రజలకు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి

-రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ ఆర్ వి. కర్ణన్

V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: కామారెడ్డి పట్టణ కేంద్రంలో గల ప్రభుత్వ ఆస్పత్రి ని శనివారం రోజు రాష్ట్ర వైద్యా ఆరోగ్యశాఖ కమిషనర్ అని ఆర్ వి. కర్ణన్ ఆకస్మికంగా సందర్శించి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు వినిపించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని వైద్యులకు తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఆస్పత్రిలోని డయాలసిస్, ఆపరేషన్ థియేటర్, పాలియేటివ్ కేర్ సెంటర్, చిత్ర చికిత్స వార్డ్, ఎమర్జెన్సీ వార్డు, రక్త నిధి కేంద్రం, సెంట్రల్ ల్యాబ్, స్కానింగ్ సెంటర్, ఆర్టీసీఆర్ కేంద్రాలను పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్ కార్యాలయంలో వైద్య ఆరోగ్యశాఖ జిల్లా అధికారులు, పంచాయతీరాజ్ శాఖ, సంక్షేమ శాఖ అధికారులు, మున్సిపల్ శాఖ అధికారులు, జిల్లాస్థాయి వైద్యాధికారులు మరియు సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రజలకు వర్షాకాలం కారణంగా డెంగ్యూ, మలేరియా మరియు ఇతర సీజన్ వ్యాధులు ప్రబలకుండా తగుజాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india