V1 న్యూస్ బీర్కూర్ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: బీర్కూర్ మండల కేంద్రం శివారులో గల మంజీరా నది నుండి ఇసుక మాఫియా విచ్చలవిడిగా కొనసాగుతున్నట్లు తహసిల్దార్ లత కు స్థానికులు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఆమె మంజీరా నది నుండి ఎలాంటి వే బిల్లులు చెల్లించకుండా మరియు ఓవర్ లోడ్ తో ప్రయాణిస్తున్న రెండు ఇసుక టిప్పర్లను అదుపులోకి తీసుకున్నారు. రెండు ఇసుక టిప్పర్లకు గాను రూ.20 వేలు జరిమానా విధించినట్లు ఆమె తెలిపారు. పగలు రాత్రి తేడా లేకుండా వందల సంఖ్యలో లారీలలో ఓవర్ లోడ్ తో మరియు వేబిల్ లు లేకుండా ఇసుక అక్రమ రవాణా ప్రతిరోజు జరుగుతుందని మంజీరా నదికి సమీపంలో ఉన్న గ్రామాలలో వేగంగా వాహనాలు ప్రయాణించడం వల్ల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. రాత్రింబవళ్లు వాహనాల రణగొణ ధ్వనులు ప్రజలకు నిద్రించడానికి అంతరాయం కలిగిస్తున్నాయని తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








