V1 న్యూస్ నసురుల్లాబాద్ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండలంలోని సంగం గ్రామంలో శనివారం రోజు” గ్రూప్ ఆఫ్ హెల్పింగ్ ఫ్రెండ్స్”ఆధ్వర్యంలో” మెడి కవర్ హాస్పిటల్ “నిజామాబాద్ వారి సహకారంతో సంయుక్తంగా ఉచిత మెగా హెల్త్ క్యాంపును నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు దాదాపు 370 మంది వివిధ రకాల వ్యాధిగ్రస్తులకు ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించారు. అందులో 35 మందికి పైగా షుగర్ వ్యాధి ఉన్నట్లు గుర్తించారు. 47 మందికి హైబీపీ ఉందని వైద్యులు తెలిపారు. అందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స అందజేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ క్రమంలో డాక్టర్ దత్తు రాజు గ్రామ ప్రజలతో మాట్లాడుతూ వర్షాకాలంలో వచ్చే వ్యాధుల బారిన పడకుండా ప్రజలు గృహ పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకొని జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రూప్ ఆఫ్ హెల్పింగ్ వ్యవస్థాపకులు నరేష్ రాథోడ్ మాట్లాడుతూ వర్షాకాలం మొదలవుతున్న సందర్భంగా ప్రజలకు విష జ్వరాలు అంటువ్యాధులు ప్రబలకుండా అవగాహన కల్పించడానికి మరియు బిపి, షుగర్ వంటి వ్యాధులకు ప్రాథమిక పరీక్షలు నిర్వహించి పేద ప్రజలకు వైద్య సహాయం మరియు మందులు అందించడానికి ఉచితంగా హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నసురుల్లాబాద్ మండల ఎంపిపి పాల్త్యా విట్టల్ , గ్రామపంచాయతీ కార్యదర్శి అనిల్, గ్రూప్ ఆఫ్ హెల్పింగ్ ఫ్రెండ్స్ అధ్యక్షులు సురేష్ కుమార్, సునీల్ రాథోడ్, అశోక్, భాస్కర్, సిరి చంద్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








