V1 న్యూస్ నసురుల్లాబాద్ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు సున్నం సాయిలు ఆధ్వర్యంలో శనివారం రోజు డాక్టర్. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అఖండ భారతావని కొరకు ప్రాణాలను అర్పించిన భరతమాత ముద్దుబిడ్డ” జన సంఘ్” వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అని కొనియాడారు. ఈ క్రమంలో మండలంలోని గ్రామాలలో బూత్ అధ్యక్షులకు ఒక్కొక్క బూత్ స్థాయిలో కనీసం 10 మొక్కలు నాటాలని సూచించారు. మొక్కలను నాటడం వలన పర్యావరణం సమతుల్యంగా ఉంటుందని తెలిపారు. ప్రాణవాయువు ఆక్సిజన్ లభించడమే కాకుండా.. సకాలంలో వర్షాలు సమృద్ధిగా కురవడంలో మొక్కలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓ బి సి జిల్లా కార్యదర్శి వడ్ల సతీష్ , మండల ప్రధాన కార్యదర్శి మేకల రాములు యాదవ్, కిసాన్ మోర్చా మండల జి .యాదగిరి గౌడ్, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు టేకుర్ల శేఖర్, శక్తి కేంద్రం ఇన్చార్జ్ లు దుర్కి సాయిలు, పెర్కరాములు, బూత్ అధ్యక్షుడు టేకుర్ల పవన్, బత్తిని రాజు, కంది పెద్ద మల్లేష్, మనూరి సాయన్న, అరిగె నారాయణ, ఉల్లెంగ గోపి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








