V1News Telangana

best news portal development company in india

అట్టహాసంగా పాలకవర్గ సన్మాన కార్యక్రమం

SHARE:

????ఎంపీపీ కి గణ సన్మానం

????పదవిని మాత్రమే వీడుతున్నాను ప్రజాసేవను కాదు – ఎంపీపీ పాల్త్య విట్టల్

V1 నసురుల్లాబాద్ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల కేంద్రంలో సమీకృత కార్యాలయ భవనంలో మంగళవారం రోజు జరిగిన సర్వసభ సమావేశం చివరిది కావడంతో పాలకవర్గ సభ్యులను అధికారులు, ప్రజా ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీపీ పాల్త్య విట్టల్ మాట్లాడుతూ కేవలం మండల పరిషత్ అధ్యక్షుని పదవిని మాత్రమే వీడుతున్నానని ప్రజాసేవను వీడడం లేదని అన్నారు. మండల ప్రజలకు ప్రజా ప్రతినిధులకు అధికారులకు ఎల్లప్పుడూ తాను అందుబాటులో ఉంటాను అన్నాడు. నసురుల్లాబాద్ మండలం నూతనంగా ఏర్పడ్డాక మొదటి ఎంపీపీగా ఎన్నిక కావడం గర్వంగా ఉందని ఈ అవకాశాన్ని కల్పించిన మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు. ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ ప్రభాకర్ రెడ్డి, జడ్పిటిసి జన్నుబాయి, జిల్లా పరిషత్ కో ఆప్షన్ మెంబర్ మాజీద్ లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ ప్రవీణ్ కుమార్, ఎంపీడీవో నీలావతి, వివిధ శాఖల అధికారులు, మాజీ ఎంపీటీసీ కంది మల్లేష్, మాజీ పిఎసిఎస్ చైర్మన్ పెరిక శ్రీనివాస్, మాజీ సర్పంచ్ అరిగె సాయిలు, వివిధ గ్రామాల నాయకులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india