V1 న్యూస్ నసురుల్లాబాద్ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల కేంద్రంలో గల సమీకృత భవన సముదాయంలో.. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ పాల్త్యా విటల్ అధ్యక్షతన అన్ని శాఖల అధికారులు మరియు ఎంపీటీసీలు, సర్పంచులు హాజరయ్యి సాధారణ సర్వసభ్య సమావేశం మరియు వీడ్కోలు సభను ఏర్పాటు చేశారు. జులై 4వ తేదీన ఎంపీపీ మరియు ఎంపీటీసీల పదవీకాలం ముగియనుంది. సర్పంచ్ ల పదవీకాలం ముందుగానే ముగిసి పోయిన విషయం తెలిసిందే.ఈ సందర్భంగా వారు పదవి లో ఉన్నప్పుడు చేపట్టిన పరిపాలన, అభివృద్ధి పనులను గురించి గుర్తు చేసుకున్నారు. పదవీకాలం ముగియడంతో కొంతమేర చింతించారు. అయినప్పటికీ పదవీకాలం ముగియడంతో వీడ్కోలు తప్పదని అన్నారు. వీడ్కోలు పదవికి మాత్రమే కానీ ప్రజాసేవలో ఎప్పటికీ కొనసాగుతామని శాశ్వత పదవి విరమణ లేనిది ప్రజాప్రతినిధులకే అని గుర్తు చేశారు. ఈ క్రమంలో నసురుల్లాబాద్ మాజీ సర్పంచ్ అరిగె సాయిలు ను ఎంపీపీ పాల్త్యా విట్టల్, వైస్ ఎంపీపీ ప్రభాకర్ రెడ్డి, జెడ్పిటిసి జన్ను బాయ్ , జిల్లా కోఆప్షన్ మెంబర్ మాజీద్, నాయకులు పెరిక శ్రీనివాస్, ఎంపీ ఓ రాము తదితరులు సన్మానించి అభినందనలు తెలిపారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








