???? చిన్నపాటి గాలులకే పలుమార్లు విద్యుత్ అంతరాయం
???? నేలకూలుతున్న విద్యుత్ స్తంభాలు
???? ఫ్రీ మాన్ సూన్ పనులు చేపట్టకపోవడం పై వినియోగదారుల ఆగ్రహం
???? నిత్యం విద్యుత్ కోతలే
???? నిమ్మకు నీరు ఎత్తినట్లు వ్యవహరిస్తున్న విద్యుత్ శాఖ అధికారులు
V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: వ్యాప్తంగా వర్షాకాలం ప్రారంభంలోనే ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఎప్పుడు ఏ క్షణంలో వర్షం పడుతుందో ఏ సమయంలో వడగాలులు వీస్తాయో అనే అయోమయంలో ప్రజలు ఉన్నారు. అయితే సబ్ స్టేషన్లు ఉన్న ప్రాంతాల్లోనే ఎక్కువ కరెంటు కోతలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. అందులో ముఖ్యంగా నసురుల్లాబాద్ సబ్ స్టేషన్ పరిధిలో ఎక్కువగా విద్యుత్ కోతలు గురవుతున్నాయి. ఇక గ్రామీణ ప్రాంతాల్లో అయితే పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. చిన్నపాటి గాలులతో కూడిన వర్షం కురిస్తే చాలు విద్యుత్తు ను నిలిపేస్తున్నారు. ఈదురు గాలులు వీసినప్పుడు భయపడి కరెంటు కోతలు విధించే బదులు ముందస్తు చర్యలు చేపట్టి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. గతంలో మరమ్మత్తుల పేరిట గంటల తరబడి విద్యుత్ కోతలు నిలిపేస్తూ ఉండేవారు. వర్షాకాలం ప్రారంభానికి ముందే అధికారులు ఫ్రీ మాన్ సూన్ పనులు నిర్వహించాల్సి ఉండగా నిర్లక్ష్యంతో పనులు గాలికి వదిలేస్తున్నారు. వర్షాకాలం ప్రారంభమైన తర్వాత చిన్నపాటి వర్షాలకే సమస్యలను గుర్తించి మరమ్మత్తులు చేస్తున్నామంటూ గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిపేస్తున్నారు.
*క్షేత్రస్థాయిలో నోచుకోని మరమ్మత్తులు*….?
ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల పాటు విద్యుత్ సరఫరా అందిస్తుంది. అకాల వర్షాలకు, ఈదురు గాలులకు విద్యుత్ సరఫరాల్లో అంతరాయం కలగడం సాధారణంగా మారిపోయిందని ప్రజలు వాపోతున్నారు. ముఖ్యంగా తీవ్రతతో కూడిన గాలులు వీచినప్పుడు చెట్ల కొమ్మలు విరిగి కరెంట్ తీగలపై పడడం వలన అవి తెగిపోయి విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. అయితే వర్షాకాలం ఆరంభానికి ముందే అన్ని సబ్ స్టేషన్ ల పరిధిలో ఫీడర్ ఛానల్ లను సరిదిద్దడంతోపాటు విద్యుత్ తీగలపై ఆనుకుని ఉన్న చెట్ల కొమ్మలను తొలగించే పనులు చేయాల్సి ఉంటుంది. అలాంటి ఫ్రీ మాన్ సూన్ పనులు వర్షాకాలం ఆరంభానికి ముందు ఎక్కడా కనిపించలేదు. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ వినియోగం బాగా పెరగడం వల్ల అధిక లోడ్ ఉన్నప్పుడు కరెంటు పలుమార్లు ట్రిప్ అవుతుంది. ఫ్రీ మాన్ సూన్ పనులు సక్రమంగా చేపట్టకపోవడం వలన ఈదురు గాలులు వీచిన వర్షం కురిసిన వెంటనే విద్యుత్ సరఫరా నిలిపేస్తున్నారు. లేకపోతే చెట్ల కొమ్మలు తగిలి విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. జిల్లాలో వారం రోజుల క్రితం ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురవడంతో అనేకసార్లు విద్యుత్ సరఫరా నిలిపేశారు.
*అధికారుల జాడెక్కడ*
అత్యవసర సేవల విభాగంలో ఉన్న విద్యుత్ శాఖ అధికారులు మండల హెడ్ క్వార్టర్స్ లో ఉండాల్సి ఉండగా కిందిస్థాయి సిబ్బంది(JLM)ని మాత్రం ఉంచి మిగతావారు ఇళ్లకు వెళ్లిపోతున్నారు. ఏఈ మరియు లైన్ మెన్ లు స్థానికంగా నివసించడం లేదు.. ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురవడం వల్ల విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడినప్పుడు గంటల పాటు సమయం గడిచిన తర్వాత తీరిగ్గా వచ్చి కిందిస్థాయి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా దూర ప్రాంతాల్లో నివసిస్తూ విధులు నిర్వహిస్తున్నప్పటికీ ఉన్నతాధికారులు చూసి చూడనట్లు వ్యవహరించే తీరు పలు అనుమానాలకు తావిస్తుంది.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








