Post Views: 93
V1 న్యూస్ బీర్కూర్ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: బీర్కూరు మండలంలోని వెంకటప్పయ్య క్యాంపు గ్రామానికి చెందిన మన్నం కిషోర్ బాబు తన తండ్రి ప్రభాకర్ రావ్ జ్ఞాపకార్థం ఆదివారం రోజు రూ.75 వేలు విలువగల శీతల శవ పేటికను బీర్కూర్ లయన్స్ క్లబ్ వారికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలకు ఆకర్షితుడై తన తండ్రి జ్ఞాపకార్థం ప్రజలకు ఉపయోగపడే విధంగా అందజేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో విట్టల్, సంతోష్, గాలయ్య, రమేష్, సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








