V1News Telangana

best news portal development company in india

NDD MOP UP DAY”సందర్భంగా పిల్లలకు నులిపురుగుల నివారణకు ఆల్బండజోల్ టాబ్లెట్స్ పంపిణీ

SHARE:

V1 న్యూస్ నసురుల్లాబాద్ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల కేంద్రంలో గురువారం రోజు “NDD MOP UP DAY” సందర్భంగా, జూన్ 20వ తేదీ అంతర్జాతీయ నులిపురుగుల దినోత్సవం రోజు వాటి నివారణకు సంబంధించిన టాబ్లెట్స్ వేయించుకొని 19 సంవత్సరాల లోపు వయస్సు గల పిల్లలను గుర్తించి అంగన్వాడి కేంద్రంలో గంగామణి టీచర్, మరియు గ్రామంలో ఆశా వర్కర్ లావణ్య ఆధ్వర్యంలో ఆల్బెండజోల్ టాబ్లెట్స్ వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నులిపురుగుల ప్రభావం వలన పిల్లలలో రక్తహీనత, ఎదుగుదల లోపించడం, తరచూ అనారోగ్యాల బారిన పడతారని తెలిపారు. అందువల్ల తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు వారి పిల్లలకు ఆల్బెండజోల్ టాబ్లెట్స్ వేయించి నులిపురుగుల నివారణకు కృషి చేయాలని తెలియజేశారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india