Post Views: 162
V1 న్యూస్ నసురుల్లాబాద్ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండలంలోని మైలారం గ్రామంలో భారతీయ జనతా పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మేకల రాములు మాతృమూర్తి గత కొద్ది రోజుల క్రితం మరణించారు. విషయం తెలుసుకున్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ బుధవారం రోజు వారి నివాసానికి వెళ్లి పరామర్శించి ఓదార్చారు. వారి మాతృమూర్తి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు. ఈ సందర్భంలో ఆయన వెంట బిజెపి బాన్సువాడ కన్వీనర్ జి. శ్రీనివాస్, పైడి లక్ష్మీనారాయణ, చందూరి హన్మండ్లు, మండల అధ్యక్షుడు సున్నం సాయిలు, వడ్ల సతీష్, పెర్క రాములు, పవన్, పద్మశాలి రాజు, హరి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








