Post Views: 82
V1 న్యూస్ నసురుల్లాబాద్ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండలంలోని నెమ్లి గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో బుధవారం రోజు అంతర్జాతీయ మాదకద్రవ్యాల నిర్మూలన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు గ్రామంలోని వీధుల గుండా ర్యాలీ నిర్వహించి.. తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం ప్రయాణ ప్రాంగణం ఆవరణలో మాదకద్రవ్యాల నిర్మూలన గురించి మరియు వాటి రవాణాకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు .ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు దుర్గాబాయి ,ఉపాధ్యాయులు విద్యార్థులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








